»Chandrababu Will Stoop To Any Extent For Alliances Cm Jagan Fire
CM Jagan: చంద్రబాబు పొత్తులు జిత్తుల కోసం ఎంతకైనా దిగజారుతాడు
కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతాడన్నారు. చంద్రబాబుకు ఒర్జినాల్టీ లేదని, పర్సనాల్టీ లేదని, క్యారెక్టర్ లేదని విమర్శించారు.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)పై సీఎం జగన్(CM Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతాడని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా(Ysr Raitu Bharosa )–పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సందర్భంగా జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 2023–24 సీజన్‌కు సంబంధించి 52 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు తొలి విడతగా 7,500 చొప్పున పెట్టుబడి సాయంతో పాటగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ అందించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
బహిరంగ సభలో సీఎం జగన్(CM Jagan) మాట్లాడుతూ చంద్రబాబు(Chandrababu)పై ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడిచేందుకు వెనుకాడరని, రాజమండ్రిలో మహానాడు పేరుతో టీడీపీ డ్రామా చేసిందన్నారు. వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తిని ఇప్పుడు యుగపురుషుడు, రాముడు, కృష్ణుడు అంటూ కీర్తిస్తుండటం బాధాకరమన్నారు. టీడీపీ మ్యానిఫెస్టోను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. మట్టి నుంచి వైసీపీ మ్యానిఫెస్టో పుట్టిందని, కర్ణాటక నుంచి బాబు మ్యానిఫెస్టో పుట్టిందని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.
పొత్తుల కోసం చంద్రబాబు(Chandrababu) ఎంతకైనా దిగజారుతారని, వైసీపీ(YCP) హామీలు కాపీ కొట్టి పులిహోర వండారని అన్నారు. 175 సీట్లలో పోటీ చేసేందుకు టీడీపీకి క్యాండెట్లు కూడా లేరని ఎద్దెవా చేశారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువే తాండవిస్తుందని, టీడీపీ(TDP) పాలనలో కనీసం సగం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేవారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఒర్జినాల్టీ లేదని, పర్సనాల్టీ లేదని, క్యారెక్టర్ లేదని విమర్శించారు. మరో ఛాన్స్ ఇవ్వండని చెబుతూ ఏవేవో చేసేస్తామని అంటున్నాడని, ఆయన పాలనలో ప్రజలకు ఏ ప్రయోజనం జరగలేదన్నారు. రాబోయే రోజుల్లో ఓ యుద్ధం జరగబోతోందని, టీడీపీని నమ్మి మోసపోవద్దని సీఎం జగన్(CM Jagan) అన్నారు.