ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండె సంబంధిత శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి కోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోర్టులో మెమో దాఖలు చేసింది.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు(ys viveka murder case)కు సంబంధించి హైకోర్టు(High Court)లో వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తన తల్లి శ్రీలక్ష్మి(Srilakshmi) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న తరుణంలో ఆమెను హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్(Hyderabad)లోనే ఉంటున్నాడు. ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేయగా కోర్టు కూడా ఆయన బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అయితే అవినాష్ రెడ్డి(Avinash Reddy) వాదనల్లో తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతున్నట్లు కోర్టుకు తెలిపారు. అయితే అసలు శస్త్రచికిత్స జరగనేలేదని సునీతారెడ్డి(Sunitha Reddy) బుధవారం తెలంగాణ హైకోర్టుకు మోమో దాఖలు చేశారు. తన తల్లికి గుండె కవాటాలు మూసుకుపోవడంతో ఆపరేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు అవినాష్ రెడ్డి న్యాయవాది వాదించారు. దీంతో కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా అరెస్ట్ చేయవద్దని అవినాష్ రెడ్డికి 27న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఒకవేళ అవినాష్ రెడ్డి(Avinash Reddy) తన తల్లి శస్త్రచికిత్స గురించి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి(Sunitha Reddy) తన మెమోలో పేర్కొంది. మీడియా కథనాల ద్వారా అవినాష్ రెడ్డి తల్లికి శస్త్రచికిత్స జరగలేదని తెలిసినట్లు సునితా రెడ్డి తెలిపింది. శస్త్రచికిత్స సంబంధించి సరైన రికార్డులు లేకపోవడం వల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో సునితారెడ్డి మెమోను న్యాయమూర్తి స్వీకరించారు.