»Chandrababu Meeting With Jp Nadda And Amit Shah At Delhi Is The Alliance Finalized Again
JP Nadda and Amit Shah:తో చంద్రబాబు భేటీ..మళ్లీ పొత్తు ఖరారైందా?
ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP), జనసేన, బీజేపీ(BJP)ల మధ్య పొత్తు ఉంటుందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో శనివారం సాయంత్రం అమిత్ షా, జెపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా( jp Nadda), కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah)తో తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు, సాయంత్రం నడ్డా, షా నివాసంలో చర్చలు జరిపారు. చంద్రబాబు పర్యటనను పార్టీ వర్గాలు ప్రైవేట్ కార్యక్రమంగా అభివర్ణించినా.. దాదాపు 50 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటీలో రాజకీయంగా పొత్తులకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి అమిత్ షా ఆహ్వానం పలికినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌పై 2018లో బీజేపీ(BJP)తో చంద్రబాబు నాయుడు తెగతెంపులు చేసుకున్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి యూనిట్‌లోని ఒక వర్గం నాయకులు నాయుడుతో పొత్తును వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీపై నాయుడు చేసిన విమర్శలను గుర్తు చేసినట్లు తెలిసింది.
ఏది ఏమైనప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కారణంగా బీజేపీ సీనియర్ నాయకత్వం దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలపై, ప్రధానంగా తెలంగాణ(telangana), ఆంధ్రప్రదేశ్(AP)లపై దృష్టి సారించింది. గతంలో షా టీడీపీతో పొత్తును తోసిపుచ్చారు. అయితే గత సంవత్సరం నుంచి నాయుడు ప్రధానమంత్రితో సహా బీజేపీ నాయకులను కలవడానికి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి కలిశారు. గత ఏడాది రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఎ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కూడా టీడీపీ మద్దతు ఇచ్చింది.