»Nara Lokesh Comments To Cm Jagan On Ycp Leaders Scam Thousand Crores Of Sand Mafia Ysr District
Nara Lokesh: వైసీపీ నేతల వెయ్యి కోట్ల ఇసుక దోపిడీకి సీఎం బాధ్యత వహించాలి
వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార వైసీపీ పార్టీ నేతలు దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ జిల్లా(ysr district)లో ఇసుక అక్రమ తవ్వకాలతో రూ.1000 కోట్ల ప్రజాధనాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుచరులే దోచుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara Lokesh) ఆరోపించారు. యువ గళం పాదయాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. ఈ ప్రాంతంలో ప్రవహించే పెన్నా, పాపాగ్ని, కుందూ నదులతో పాటు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన కమలాపురం పుణ్యభూమి లాంటిదని పేర్కొన్నారు. ఈ పుణ్య భూమిలో పాదయాత్ర నిర్వహించడం తన అదృష్టమని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అన్నమయ్య ఆనకట్ట కూలి 61 మంది ప్రాణాలు కోల్పోవడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ys jagan mohanreddy) బాధ్యత వహించాలని లోకేష్ పేర్కొన్నారు. డ్యాం పరిధిలోని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులిచ్చి విచక్షణారహితంగా ఇసుక తవ్వకాలు సాగించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. కడప జిల్లాలో యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆకస్మిక స్పందనను జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో తనపై కోడిగుడ్లతో దాడులను ప్రోత్సహించారని విమర్శించారు.
రాష్ట్రంలో సంపూర్ణ నిషేధం అమలు చేస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని లోకేష్ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం తాగడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అక్రమ ఇసుక(sand mafia), మట్టి, కంకర తవ్వకాలు, భూకబ్జాలకు కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి బాధ్యులని నారా లోకేష్ ఆరోపించారు. నియోజకవర్గంలోని శ్మశాన వాటికలను కూడా ఎమ్మెల్యే అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. కడప నగరంలో రూ.200 కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కబ్జా చేశారని వ్యాఖ్యానించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే భూ కుంభకోణాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.