CM KCR: తెలంగాణ పథకాలను మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు
పట్టుదల, కృషితో ముందుకుపోయి దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను కూడా సమాన స్థాయికి తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. తాగు, కరెంట్, సాగునీటి సమస్యలను 9 ఏళ్లలో అధికమించామన్నారు. పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని, ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు.
తెలంగాణ(Telangana) పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోందని, అందుకు ప్రభుత్వ ఉద్యోగులే కారణమని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి నాలుగు మెడికల్ కాలేజీల(Medical Colleges)కు వేదిక కానున్నదని అన్నారు.
ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ(Medical College) వచ్చిందని, ఏపీలో ఉంటే 50 ఏళ్లకు కూడా ఆ కాలేజీ వచ్చేది కాదన్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను దాటేసి తెలంగాణ(Telangana) ముందుకు సాగుతోందన్నారు. అందరి సమిష్టి కృషి వల్లే అది సాధ్యమైందన్నారు. తెలంగాణలో కూడా చాలా పేదరికం ఉందని, దళిత జాతి, గిరిజన జాతి, వెనుకబడి తరగతుల్లో నిరుపేదలు ఉన్నారని, వారికి జరగాల్సింది ఇంకా చాలానే ఉందన్నారు.
పట్టుదల, కృషితో ముందుకు పోయి సోదరులుగా ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను కూడా సమాన స్థాయికి తీసుకుపోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. తాగు, కరెంట్, సాగునీటి సమస్యలను 9 ఏళ్లలో అధికమించామన్నారు. పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలని, ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి పథకాలను చూసి తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.