ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ(Telangana)లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురవనున్నట్లు తెలిపింది. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలను హెచ్చరించింది.
తెలంగాణ(Telangana)లో మరో నాలుగు రోజులు వర్షాలు(Rains) పడతాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow alert) జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
మిగిలిన ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) తెలిపింది. రాబోయే ఏడు రోజులు రాష్ట్రమంతటా గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు(Temperature) నమోదవుతాయని పేర్కొంది. 42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పగటి పూట ఎండలు ఉంటూనే సాయంత్రం నుంచి వర్షాలు పడే వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.