»Rs 10 Lakh Compensation For Ap Who Died In Train Accident
CM Jagan: రైలు ప్రమాదంలో చనిపోయిన ఏపీ వారికి రూ.10 లక్షల పరిహారం.. సీఎం జగన్ ప్రకటన
కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో ఇప్పటి వరకూ 288 మంది మరణించారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express)లో ఏపీకి చెందినవారు 178 మంది ఉన్నారు. అయితే వీరిలో కొందరి ఆచూకీ ఇంత వరకూ లభించలేదు. స్థానికులు, అధికారులు, సహాయక బృందాల వల్ల చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. నాలుగు రాష్ట్రాల ప్రజలను ఈ రైలు ప్రమాద ఘటన ఉలిక్కిపడేలా చేసింది.
తాజాగా సీఎం జగన్(CM Jagan) ఈ ఘటనకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో ఏపీ ప్రజలు ఎవరైనా మరణించి ఉంటే వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని(Compensation) జగన్ ప్రకటించారు. ఈ విషయంలో అధికారులకు కూడా ఆదేశాలను జారీ చేశారు. రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన(Injured) వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసి ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కాగా ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన 695 మంది ప్రయాణించారు. అందులో 553 మంది సురక్షితంగా ఉన్నారు. ప్రస్తుతం 25 మంది కాంటాక్ట్‌లో లేకపోవడంతో వారి కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.