Experts Are Submit Coromandel Train Accident Primary Report
Coromandel Train Accident: ఒడిశాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం (Coromandel Train Accident) పలువురి జీవితాల్లో విషాదం నింపింది. 288 పై చిలుకు మంది చనిపోగా.. వెయ్యి మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణం ఏంటో నిపుణుల కమిటీ తేల్చింది. ప్రాథమిక నివేదికను రైల్వేశాఖకు అందజేసింది. కోరమండల్ రైలుకు సిగ్నల్ (signal) లభించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని నిపుణుల కమిటీ తేల్చింది. మొదట సిగ్నల్ ఇచ్చి.. ఆ తర్వాత ఆపివేశారని పేర్కొంది. దీంతో కోరమండల్ రైలు రాంగ్ ట్రాక్‌పైకి వెళ్లిందని చెప్పింది. మెయిన్ లైన్ బదులు లూప్ లైన్లోకి వెళ్లిందని పేర్కొంది. అక్కడ గూడ్స్ రైలు ఉండటంతో ప్రమాదం జరిగిందని వివరించింది. సాయంత్రం 6.55 గంటలకు ప్రమాదం జరిగిందని తెలిపింది. రైలు ప్రమాదంతో కోరమండల్ రైలు 21 బోగీలు పట్టాలు తప్పాయని వెల్లడించింది.