Chandrababu: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని అధికార వైసీపీ (ycp) చెబుతోంది. ముందస్తుకు వెళ్లే ఆలోచన తమకు లేదని స్పష్టంచేసింది. ఇటు పొత్తలుపై జనసేన-బీజేపీ-టీడీపీ మధ్య సయోధ్య కుదరలేదు. జనసేన- బీజేపీ మాత్రం ఓకే.. టీడీపీ చేరిక గురించి సమాచారం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amith shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను (jp nadda) కలిశారు.
వీరి భేటీ గురించి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును (somu veerraju) మీడియా ప్రతినిధులు అడిగారు. వారి సమావేశం గురించి సమాచారం తమకు లేదని చెప్పారు. ఆ విషయం చంద్రబాబునే (chandrababu) అడిగితే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు (chandrababu) గొప్ప నేత అని ప్రశంసించారు. పార్టీ ముఖ్య నేతలను చంద్రబాబు కలిస్తే.. తమకు సమాచారం లేదని.. పైగా అతనే గొప్ప నేత అని సోము వీర్రాజు (somu veerraju) అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అనే చర్చకు దారితీసింది.
పార్టీ పెద్దలను ఎవరనా కలవొచ్చు అని సోము వీర్రాజు (somu veerraju) అన్నారు. అందులో తప్పేం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను అభ్యర్థులను ప్రకటించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం లేదని చెప్పారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దేవానంద్ వసూళ్లకు పాల్పడుతున్న ఆరోపణలపై ప్రశ్నించారు. ఈ విషయం హైకమాండ్ వద్దకు వెళ్లిందని చెప్పారు. సమస్యను వారే చూసుకుంటారని వివరించారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పొత్తులపై మాత్రం క్లారిటీ లేదు. ఈ క్రమంలో సోము వీర్రాజు చంద్రబాబును పొడగడం చర్చకు దారితీసింది. అంటే బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ పొత్తుకు సై అందా అనే అనుమానాలు తలెత్తాయి.