Kesineni Nani హాట్ కామెంట్స్, ఇంచార్జీలు ఎవరు, గొట్టంగాళ్లు
ఇంచార్జీలు కలిసి రావడం లేదా..? అని మీడియా ప్రతినిధి విజయవాడి ఎంపీ కేశినేని నానిని ప్రశ్నించగా భగ్గుమన్నారు. ఇంచార్జీ అనేది రాజ్యాంగ బద్ద పదవీ కాదన్నారు. సామంత రాజు, రాజులు , రారాజులు ఎవరూ ఇక్కడ లేరన్నారు. ఇంచార్జీలు ఎవరు గొట్టంగాళ్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ పరిధి నియోజకవర్గాల్లో నీటి ట్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ఇతర అంశాలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇంచార్జీలు కలిసి రావడం లేదా..? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా భగ్గుమన్నారు. ఇంచార్జీ అనేది రాజ్యాంగ బద్ద పదవీ కాదన్నారు. సామంత రాజు, రాజులు , రారాజులు ఎవరూ ఇక్కడ లేరన్నారు. ఇంచార్జీలు ఎవరు గొట్టంగాళ్లు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
100 డిగ్రీలకు చేరితే చుద్దాం..
ఇక్కడ గద్దె రామ్మోహన్ రావు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. కలిసి వస్తే పనిచేస్తాం అని కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. మంచి వారు పార్టీకి అవసరం అని.. అందుకే తనకు ఇతర పార్టీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయని ఇండైరెక్టుగా చెప్పారు. పొమ్మనలేక పొగపెడితే చూస్తానని.. ఇప్పుడు హీట్ 45 నుంచి 50 డిగ్రీలు మాత్రమే ఉందన్నారు. అదీ 100కు చేరినప్పుడు చుద్దాం లే అన్నారు. టీడీపీలో కేశినేని నాని ఇష్యూ ఉంది. టికెట్ కేటాయింపు దాదాపు కష్టమని సమాచారం. ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. నానితో సంప్రదింపులు జరిపారట. పార్టీలోకి రావాలని ఆహ్వానించారని వార్తలు గుప్పుమన్నాయి. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కేశినేని నాని అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇతర అంశాలు టీడీపీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. వైసీపీ తప్ప అన్నీ పార్టీలతో సఖ్యంగా ఉన్నానని.. ప్రజలు ఆశీర్వదిస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధిస్తానని నాని (Kesineni Nani) అంటున్నారు.
కేశినేని చిన్నికే టికెట్
ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమానికి కూడా నాని (Kesineni Nani హాజరవలేదు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నీ తానై చూసుకున్నారు. ఆహ్వానం రాకపోవడంతో వెళ్లలేదని చెప్పారు. హైకమాండ్, ఇంచార్జీలతో నానికి గ్యాప్ ఏర్పడింది. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో బాబు పీఏ కేశినేని నానికి ఫోన్ చేశారట. అమిత్ షాతో బాబు మీట్ కాగా.. అక్కడికి నాని వెళ్లారు. చర్చల గురించి తనకు తెలియదని అంటున్నారు. ఇంతలోనే భగ్గుమున్నారు. కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలో యాక్టివ్ అవుతున్నారు. బొండ ఉమ, బుద్దా వెంకన్నతో కలిసి తిరుగుతున్నారు. విజయవాడ ఎంపీ టికెట్ ఆయనకే వస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇలా అన్నీ విషయాలు కలిపి.. కేశినేని నాని బ్లాస్ట్ అయ్యారు.
పనిచేయని ఆ ముగ్గురు
విజయవాడ మున్సిపల్ ఎన్నికల సమయంలో బుద్దా వెంకన్న, బొండా ఉమ, నాగుల్ మీరా.. కేశినేని నానికి పనిచేయలేదు. ఆ సమయంలో నాని తన కూతురు శ్వేతను మేయర్ చేయాలని అనుకున్నారు. టీడీపీ గెలవకపోవడంతో సాధ్యపడలేదు. అప్పటినుంచి వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కలువడం లేదు. ఇంతలో చిన్నిని తెరపైకి తీసుకొచ్చారు. సొంత తమ్ముడిని బరిలోకి దింపారు. తమ్ముడు కాదు ఎవరు బరిలోకి దిగిన గెలవరని ఇంతకుముందు నాని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.