Bhargav Ram: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌కు (Bhargav Ram) ఊరట కలిగింది. టీడీపీ నేత ఏబీ సుబ్బారెడ్డి దాడి కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ భార్గవ్‌కు బెయిల్ ఇచ్చింది. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఏబీ సుబ్బారెడ్డిపై ( AV Subba Reddy) దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడికి సంబంధించిన కేసులో భూమా అఖిలప్రియ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడి కేసులో అఖిలప్రియ (Akhila Priya) దంపతులను 14 రోజుల రిమాండ్‌కు కూడా పంపించారు. ఆ తర్వాత అఖిలప్రియ (Akhila Priya) బెయిల్ పొందారు. ఇప్పుడు భార్గవ్ రామ్ కూడా బెయిల్ వచ్చిందని వారి తరఫు న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లాలో టీడీపీ నేతలు అయిన భూమా అఖిలప్రియ (Akhila Priya), ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది.
గతంలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా ఏవీ సుబ్బారెడ్డి ( AV Subba Reddy) ఉండేవారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత మాత్రం దూరం పెరిగింది. అతని పిల్లలతో సఖ్యంగా ఉండటం లేదు. నంద్యాలలో భూమా కుటుంబం, శిల్పా కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. ఇప్పుడు భూమా ఫ్యామిలీతో ఏవీ సుబ్బారెడ్డికి పొసగడం లేదు. గతంలో ఓకే పార్టీలో ఉన్నప్పటికీ గొడవలు లేవు.. ఇప్పుడు మాత్రం ఆధిపత్య పోరు కొనసాగుతోంది.