Summer: ఎండల వేడికి మీరు బయటకొస్తలేరు..విద్యార్థులకు అప్పడే క్లాసులా?
ఎండలకు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వీడటం లేదు.. మరి విద్యార్థుల గురించి ఆలోచించరా అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. జూన్ 12వ తేదీన స్కూల్స్ రీ ఓపెన్ నిర్ణయంపై పునరాలోచించాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు.
TDP Mla Satya Prasad: జూన్ వచ్చిన ఎండలు తగ్గడం లేదు. నైరుతి రుతు పవనాలు నిన్న కేరళ తీరాన్ని తాకాయి. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు చేరున్నాయి. సో.. అకడమిక్ ఈయర్ ప్రకారం జూన్ 12వ తేదీన స్కూల్స్ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) తప్పుపట్టారు. ఈ మేరకు సీఎం జగన్‌కు (cm jagan) లేఖ రాశారు.
‘రాష్ట్రంలో ఎండలు ఇంకా తగ్గుముఖం పట్టలేదని చెప్పారు. ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు స్కూల్‌కి వస్తే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పున:ప్రారంభంపై నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరారు. పది రోజుల పాటు వాయిదా వేయాలని.. జూన్ 22న స్కూల్స్ తెరవాలి. ఎండల వేడికి మీ మంత్రులు, ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదు.. ఏసీ రూములను వీడటం లేదని సత్యప్రసాద్ అన్నారు. మరీ చిన్న పిల్లలను పాఠశాలలకు రావాలని కోరడం భావ్యమా’ అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) అడిగారు.
జగన్ సర్కార్‌కు స్కూళ్ల ప్రారంభంపై ఉన్న శ్రద్ద.. నాడు-నేడు పనులు పూర్తి చేయడంలో లేదని సత్యప్రసాద్ (Satya Prasad) మండిపడ్డారు. టీచర్లపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని అన్నారు. పలు యాప్స్ తీసుకొచ్చి పనిభారం మోపుతున్నారని ఆరోపించారు. టీచర్లను వేధింపులకు గురి చేయడం సరికాదని సూచించారు.