B.Narsing Rao: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై ప్రముఖ దర్శకుడు, నిర్మాత బీ నర్సింగరావు (B.Narsing Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ను (KTR) కలిసేందుకు 40 రోజుల నుంచి అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. రాజ్యం ఏలడమే కాదు.. రాజ్యంలో ఎవరు, ఏమిటి అనే విజ్ఞత కూడా ఉండాలని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఉన్నతమైన వ్యక్తులను అణచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించాలని లేఖలో నర్సింగరావు (B.Narsing Rao) కోరారు. రాష్ట్ర ఆవిర్భానికి ముందు ఆంధ్ర ఆదిపత్యం అడుగడుగునా నిండిన సినీ పరిశ్రమలో తెలంగాణ భావజాలాన్ని కాపాడుతూ వచ్చిన కొద్దిమంది తెలంగాణ దర్శక నిర్మాతల్లో నర్సింగ రావు (B.Narsing Rao) ఒకరు.. అలాంటి దర్శకుడు అపాయింట్మెంట్ అడిగితే కేటీఆర్ (ktr) ఇవ్వలేదట.. అందుకే ఆయన ఆగ్రహాం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
నర్సింగరావుకు (B.Narsing Rao) జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. సినిమాలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితం అయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నర్సింగరావు కీ రోల్ పోషించారు. ‘వాడు నచ్చాడా కేటీఆర్ నీకు.. నేను నచ్చలేదా? ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు? ’ అని లేఖలో ఉంది. రెండు లక్షల కోట్ల అభివృద్ధి రెండు చిల్లి గవ్వలు కూడా కావు.. రాజ్యం ఏలడమే కాదు, రాజ్యంలో ఎవరు, ఏమిటి అనే విజ్ఞత ఉండాలి. అంత గొప్ప హీనులు నీ సలహాదారులు.. అంత గొప్ప ఏలిక నీది. ఏ సంస్కృతి నుంచి వెలసిన కమలాలు మీరు. గత జాడల ఆనవాళ్లు ఏమిటీ అని అందులో నర్సింగ రావు (B.Narsing Rao) పేర్కొన్నారు.