Plane Crashes In Amazon Forest, Children Alive After 40 Days
Children Alive After 40 days: ప్రపంచంలో అతిపెద్ద అడవి అమెజాన్ ఫారెస్ట్ (Amazon Forest). ఇక్కడ ఉండే భారీ వృక్షాలతో అడవీ దట్టంగా ఉంటుంది. ఇక్కడ పలు రకాల జీవులు.. ముఖ్యంగా పెద్ద పెద్ద అనకొండలు ఉంటాయి. అలాంటి చోట ఓ విమానం (plane) కూలిపోయింది. అందులో పైలట్ (pilot), గైడ్‌తోపాటు (guide) నలుగురు చిన్నారులు, వారి తల్లి ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఆపరేషన్ హోప్ పేరుతో సహాయక చర్యలు చేపట్టారు. మే 1వ తేదీన ప్రమాదం జరగగా.. 16వ తేదీన విమాన శకలాలను గుర్తించారు. పైలట్ (pilot), చిన్నారుల తల్లి (mother), గైడ్ (guide) మృతదేహాలు కనిపించాయి.
¡Una alegría para todo el país! Aparecieron con vida los 4 niños que estaban perdidos hace 40 días en la selva colombiana. pic.twitter.com/cvADdLbCpm
అమెజాన్ అటవీ ప్రాంతం (Amazon Forest) పరిధిలో గల అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియోరే ప్రాంతానికి మే 1వ తేదీన పర్యాటకులతో విమానం బయలుదేరింది. ఆ వెంటనే ప్రమాదానికి గురయ్యింది. ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. మరో నలుగురి ఆచూకీ కనిపించలేదు. అయినప్పటికీ సెర్చ్ ఆపరేషన్ (search operation) కొనసాగింది. 150 మంది సైనికులు అడవీని జల్లెడపట్టారు. మే 18వ తేదీన చిన్నారులు క్షేమంగా ఉన్నట్టు తెలిపే ఆధారాలు కనిపించాయి. దీంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.
40 రోజుల తర్వాత శుక్రవారం ఆ నలుగురు చిన్నారులను క్షేమంగా గుర్తించారు. వారిలో 13, 9, 4 ఏళ్ల చిన్నారులు.. 11 నెలల పసి గుడ్డు కూడా ఉంది. కృూర మృగాలు తిరిగే చోట ఆ నలుగురు చిన్నారులు ఎలా బయటపడ్డారనే అంశానికి సంబంధించి వివరాలు తెలియరాలేదు. ‘దేశం అంతటికీ సంతోషకర వార్త.. 40 రోజుల క్రితం కొలంబియా అడవీలో గల్లంతైన నలుగురు పిల్లల ఆచూకీ లభించింది. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుంది అని’ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో (gustavo petro) తెలిపారు.