దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం నేత, CLP నాయకుడు భట్టి విక్రమార్క(Bhatti vikramarka) ప్రజావాణి పాదయాత్రలో నిన్న ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పాదయాత్రలో భాగంగా దేవరకొండ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడుకున్నారు. ఆ క్రమంలో నాయకుల తీరుపై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్, రవి నాయక్ వర్గాల మధ్య వర్గ పోరు జరిగినట్లు తెలిసింది. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో భట్టి పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నక్రమంలో ఇది చోటుచేసుకుంది.
భట్టి పాదయాత్రలో తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
దేవరకొండ – కాంగ్రెస్ కార్యకర్తల కొట్లాట నుండి నుండి తప్పించుకుని నాయకుల తీరుపై కోపోద్రిక్తుడైన భట్టి విక్రమార్క.
మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు కిషన్ నాయక్, రవి నాయక్ వర్గాల మధ్య కొనసాగుతున్న వర్గ పోరు. pic.twitter.com/EFdbKMbKH8