తెలంగాణ (Telangana) రాష్ట్రంలో డిసెంబరులో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని ఇంటలెక్చువల్సెల్ చైర్మన్ శ్యామ్మొహన్ (Shyam Mohan) తెలిపారు. అయితే కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని మెదక్ నుంచి పోటీ చేయించాలని నేతలంతా కోరినట్లు ఆయన వెల్లడించారు. తుది నిర్ణయం అధిష్టానందే ఉంటుందన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్(Congress)సిద్ధంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్లో జోష్వచ్చిందని, అధికారంలోకి తప్పకుండా వస్తుందన్నారు. చార్మినార్(Charminar)లోని మదీనా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆయన ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్పార్టీ మేనిఫెస్టో ప్రజలను ఉద్దేశించి ఉంటుందని, ప్రతి రంగాన్ని పరిగణలోకి తీసుకుంటూ, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. చాలా మంది మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ లోకి చేరేందుకు ఉత్సాహ పడుతున్నారన్నారు. కర్ణాటక (Karnataka) ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్లో జోష్ వచ్చిందని, తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు.