CM Ashok Gehlot రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో అభాసుపాలయ్యారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుకోని పొరపాటు జరిగింది. ఈ ఏడాది చదవాల్సిన బడ్జెట్ కు బదులు గత ఏడాది బడ్జెట్ చదివారు.
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
Pocharam Srinivas Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా..ఆయన తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మృతివార్త తెలిసి స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం క...
కొత్తగా జే ట్యాక్స్ (J Tax) అనే వాటికి భయపడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని వ్యాపారులు తెలిపారు. కంపెనీలు రాకపోవడంతో నిరుద్యోగ యువత హైదరాబాద్ (Hyderabad), బెంగళూరుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలపై టీడీపీ పుస్తకం విడుదల చేసింది. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరిట పుస్తకం తీసుకువచ్చింది. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై సవివరంగా పుస్తకం రూపొందించినట్లు తెలిపారు.
కర్ణాటక (Karnataka) కమలంలో ఎన్నికల పోరు జోరుందుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections)ఏప్రిల్ చివారి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ జరిగే అవకాశలు అధికంగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది
పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) సంబంధించి గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) శుక్రవారం ఆరోపించారు. ఆ కారణంగానే ఆలస్యమవుతోందన్నారు.
Revanth Reddy : ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్... డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా... దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
నారా లోకేష్ అతి కష్టంగా పాదయాత్ర చేయడం చూస్తుంటే తనకు చాలా బాధ వేస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
పోడు భూముల (podu lands) అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) శుక్రవారం అసెంబ్లీలో (Assembly) కీలక ప్రకటన చేశారు. గిరిజనులు ముందుకు వస్తే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ కు (Hyderabad) రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy) లో జరిగే ఐపీఎస్ పాసింగ్ ఓట్ పరేడ్ లో పాల్గొన్నందుకు భాగ్యనగరాన్నికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో రాత్రి 10:15 గంటలకు
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) వద్దకు వెళ్లింది. ఇరువురి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు బాహాటంగానే కనిపిస్తున్నాయి.
వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్‌ను రోజుకు మూడుసార్లు ఏర్పాటు చేయనున్నట్లు నడ్డా చెప్పారు.
కేటీఆర్ (KTR) అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) పేరు ఎత్తకుండా సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిలర్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ తెలంగాణ అధినేత ధీటుగా స్పందించారు. పరస్పర ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆమె ఆగడాలు పెరిగిపోయాయని సమాచారం. పలుమార్లు అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు జరిగాయి. ఆమె తన తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నగరి ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది.