Pocharam Srinivas Reddy : పుట్టినరోజు నాడు కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ పోచారం..!
Pocharam Srinivas Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా..ఆయన తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మృతివార్త తెలిసి స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం కంటతడి పెట్టడం గమనార్హం.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా..ఆయన తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మృతివార్త తెలిసి స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం కంటతడి పెట్టడం గమనార్హం.
బాల్య మిత్రుడి సాలం బీన్ అలీఖాన్ మరణంతో పోచారం తీవ్రంగా కలత చెందారు. కంటతడి పెట్టుకున్నారు. అంత్యక్రియలకు ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా వెళ్లనున్నారు. తన నియోజకవర్గంలో జన్మదిన వేడుకలు నిర్వహించవద్దని అభిమానులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా…స్పీకర్ పోచారం పుట్టినరోజును పురస్కరించుకుని అనేక మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పోచారం కలిసి పనిచేసిన రోజులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మరోవైపు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పోచారం శ్రీనివాస రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి సేవ చేసే క్రమంలో దీర్ఘాయుస్సును, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉండాలని ఆకాంక్షించారు.