»Speaker Pocharam Unveils Upside Down Flag At Assembly
Telangana అసెంబ్లీలో అపశృతి.. తలకిందులుగా ఉన్న జెండా ఆవిష్కరించిన స్పీకర్
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ వద్ద స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జెండాను ఎగరేశారు. జెండా తలకిందులుగా ఉండగా.. దానికి సెల్యూట్ చేశారు.
Speaker Pocharam Unveils Upside Down Flag At Assembly
Speaker Pocharam Srinivas Reddy: జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత దేశంలో తెలంగాణ విలీనం అయ్యింది. దీనిని కొందరు తెలంగాణ విమోచన దినోత్సవం అని పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జాతీయ సమైక్యతా దినోత్సవం అని సెలబ్రేట్ చేస్తోంది. అసెంబ్లీలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అది తలకిందులుగా ఉంది. అయినప్పటికీ దానిని సరిచేయలేదు.
స్పీకర్ పోచారం (Pocharam) జెండా ఎగరేసే సమయంలోనే కరెక్టుగా లేదు. అయినప్పటికీ దానిని కిందకి దించి సరిచేయలేదు. అక్కడ సిబ్బంది ఉన్న పట్టించుకోలేదు. తలకిందులుగా ఉన్న జెండాకే పోచారం (Pocharam)సెల్యూట్ చేశారు. తర్వాత జాతీయ గీతాలాపన జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఘటనను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సాడ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని కామెంట్ చేశారు. ఆ వీడియోను ఇప్పటికే 2 వేల పైచిలుకు మంది చూశారు. నెటిజన్ల కామెంట్లతో బాక్స్ నిండిపోయింది. ఆ మాత్రం చూసుకోరా..? ఎందుకీలా చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.