బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్న కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని స్వీకర్కు వినతి పత్రం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకిి వెళ్లారు.
Kadiam Srihari: తెలంగాణలో ఇటీవల తీవ్ర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తమపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. స్టేషన్ ఘనపూర్ నుంచి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఆయన కూతురు కడియం కావ్వ బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీచేయడానికి సిద్దం అయ్యారు. పార్టీ టికెట్ ఇచ్చిన తరువాత కొన్ని రోజులకే పార్టీని వీడారు. ఆమెతో పాటే తండ్రి కడియం శ్రీహరి సైతం పార్టీ వీడనున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి శనివారం అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ ఇవ్వాలని చూశారు. ఆయన కూడా లేరని చెప్పడంతో అక్కడే కొంత సమయం భైటాయించారు. తరువాత ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు. మళ్లీ స్వీకర్ అపాయింట్మెంట్ తీసుకొని కడియంపై అనర్హత వేటు వేయాలని కోరుతామని తాము తెలిపారు.