Gadwal Vijayalakshmi: ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని విజయలక్ష్మి తెలిపారు.