»Cm Revanth Reddy Investigation On Phone Tapping Is Complete Those Responsible Must Be Punished
CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ పక్కా.. బాధ్యులకు శిక్ష తప్పదు
ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
CM Revanth Reddy: ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ఇలా బరితెగించి మాట్లాడేవారు దాని ఫలితం అనుభవిస్తారు. ట్యాపింగ్‌పై పక్కాగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులు చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. ఇంతకు ఎవరైనా ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి భయపడేవాళ్లు. ఈరోజు అలాంటి భయం లేదు.
భార్యభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నవి విన్నారు. కొంతమంది మాట్లాడుకున్నవి విన్నామని కేటీఆర్ అన్నారు. అసలు ప్రజలు ఇళ్లలో మాట్లాడుకునే వాటితో మీకు అవసరం ఏంటి? వాళ్లు చెప్పినట్లు ఆ రోజు విని ట్యాపింగ్ చేసిన అధికారులు ఈ రోజు ఊచలు లెక్కపెడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ట్యాపింగ్ చేయవద్దని ఆరోజే చెప్పాం. కానీ వాళ్లు మా మాట వినలేదు. ట్యాపింగ్ చేయమని చెప్పినవాళ్లు కూడా వాళ్లను పట్టించుకోవట్లేదు. ఆరోజే చెప్పాం ఈ ట్యాపింగ్ వల్ల జైలుకు పోతారని రేవంత్ రెడ్డి అన్నారు.