VSP: మార్గశిర మాసం సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులలో ఒక బాలుడు, ఇద్దరు మహిళలు తప్పిపోయారు. చుట్టుప్రక్కల ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో, గుడి వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ఫిర్యాదు చేశారు. పోలీస్ సిబ్బంది పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా వారి ఆచూకీ కనుగొని, ఆ ముగ్గురిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.