కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ కు (Hyderabad) రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy) లో జరిగే ఐపీఎస్ పాసింగ్ ఓట్ పరేడ్ లో పాల్గొన్నందుకు భాగ్యనగరాన్నికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో రాత్రి 10:15 గంటలకు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ కు (Hyderabad) రానున్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ అకాడమీ (Police Academy) లో జరిగే ఐపీఎస్ పాసింగ్ ఓట్ పరేడ్ లో పాల్గొన్నందుకు భాగ్యనగరాన్నికి వస్తున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో రాత్రి 10:15 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. తెలంగాణలో రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఎన్నికల సందడి మొదలయిందని చెప్పుకోవచ్చు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముందుకు సాగుతున్నాయి. ఎత్తులు, పైఎత్తులు వేస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. శనివారం ఉదయం 7:50 గంటల నుంచి 10:30 గంటల వరకు పటేల్ పోలీస్ అకాడమీలో నిర్వహించే ఐపీఎస్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా షా పాల్గొంటారు. ఐపీఎస్‌ల పరేడ్ (IPS Parade ) అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి శంషాబాద్‌కు పయనమవుతారు. మధ్యాహ్నం 1:20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు అమిత్ షా.. మళ్లీ ఢిల్లీకి బయల్దేరుతారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ(ఎన్పీఏలో)లో మొత్తం 195 మంది (74వ బ్యాచ్) ఐపీఎస్‌ల ట్రైనింగ్ పూర్తయింది. వారికి శనివారం పాసింగ్ ఔట్ పరేడ్ (Passing out parade) నిర్వహించనున్నట్లు పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ గురువారం వెల్లడించారు. ట్రైనింగ్ పూర్తి చేసిన వారిలో 129 మంది పురుషులు, 37 మంది మహిళలు సహా 29 మంది రాయల్ భూటాన్, నేపాల్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు అమిత్ షా ట్రోఫీలను అందజేస్తారని ఆయన వెల్లడించారు.
కోవిడ్ తర్వాత పూర్తిస్థాయిలో జరగనున్న పాసింగ్ అవుట్ పరేడ్ ఇదేనని ఏఎస్ రాజన్ తెలిపారు. ఈ ఏడాదితో NPA 75 వసంతాలు పూర్తి చేసుకుంటుందని వెల్లడించారు. అనంతరం 1.25 గంటలకు ఆయన ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమంగానే కొనసాగనుంది. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేకపోవడం గమనార్హం. షా రాకపై బీఆర్ఎస్ (Brs) నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ లో ఎమ్మెల్సీ కవిత కూడా అమిత్ షా పర్యటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఎమ్మెల్సీ కవిత( Mlc kavitha) ప్రశ్నించారు. బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్: రూ. 1350 కోట్లు, ( GST) పరిహారం: రూ. 2247 కోట్ల జీఎస్టీ పరిహారం సంగతేమిటని, ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బనానికి మీ సమాధానం ఏమిటని కవిత ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెరిగిన నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై సమాధానం చెప్పాలని కవిత నిలదీశారు. ఇంధనం, (LPG ) ధరలను అధిక ధరలకు విక్రయించడంపై కూడా కవిత అమిత్ షా ను ప్రశ్నించారు. అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ & కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం (Central goverment) ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు కవిత.