»Cm Ashok Gehlot Goofs Up Reads Old Budget For Seven Minutes
CM Ashok Gehlot : పాత బడ్జెట్ ని చదివేసిన రాజస్థాన్ సీఎం…!
CM Ashok Gehlot రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో అభాసుపాలయ్యారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుకోని పొరపాటు జరిగింది. ఈ ఏడాది చదవాల్సిన బడ్జెట్ కు బదులు గత ఏడాది బడ్జెట్ చదివారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో అభాసుపాలయ్యారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుకోని పొరపాటు జరిగింది. ఈ ఏడాది చదవాల్సిన బడ్జెట్ కు బదులు గత ఏడాది బడ్జెట్ చదివారు. కొన్ని నిమిషాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు సీఎంకు ఈ విషయం గుర్తుచేశారు. వెరొకరు చెప్పేంత వరకు గుర్తించలేనంతగా అశోక్ గెహ్లాట్ ఉండటం గమనార్హం. ఈ విషయంలో కొన్ని నిమిషాల్లోనే దేశ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.
అశోక్ గెహ్లాట్ పాత బడ్జెట్ చదవడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు సభను కొంత సేపు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ఈ సంఘటనపై స్పందించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కనీసం ఒక్కసారైనా సభకు రాకముందు చదవలేకపోయారని విమర్శించారు. ఈ విషయాన్ని బట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తున్నారో స్పష్టంగా అర్ధమౌతోందని వసుంధరా రాజే విమర్శలు గుప్పించారు.
రాజస్థాన్ ప్రభుత్వానికి ఒక దిశా నిర్దేశం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జై హింద్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఆర్ధిక విషయాలు ఇక నుంచి దేవుడే చూసుకోవాలని చురకలు అంటించారు.
కొన్ని నిమిషాల పాటు సభలో గందరగోళం నెలకొన్న తర్వాత అశోక్ గెహ్లాట్ తేరుకున్నారు. కొత్త బడ్జెట్ సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా యువతకు, రైతులకు వరాలు కురిపించారు. ముఖ్యమంత్రి కామధేను బీమా యోజన పథకం ప్రవేశపెట్టారు. పశువులకు బీమా కల్పించే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రైతులను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది