Revanth Reddy : ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్... డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా... దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
ప్రగతి భవన్ పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్… డీజీపీకి ఫిర్యాదు చేసింది. కాగా… దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై ఫిర్యాదు చేసిన గులాబీ నేతలకు కౌంటర్ గా ఆయన కూడా డీజీపీకి కంప్లయింట్ చేశారు.
ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారంలో సీబీఐ విచారణకు నో చెబుతోంది ప్రభుత్వం. ఈ పంచాయితీ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ను వీడి గులాబీ గూటికి చేరిన నేతలను టార్గెట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో కలిసిన 12 మంది ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని కోరుతూ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ నుంచి అక్రమంగా వారిని చేర్చుకుందని అన్నారు రేవంత్. ఈ అంశంలో గతంలోనే ఫిర్యాదు చేశామని.. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసినట్టు వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఆశ చూపి గులాబీ కండువా కప్పారని.. ఈ విషయంలో తాము ఇప్పటికే హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.