»Rs 5 Meals Bikes For Girls In Bjp Tripura Manifesto
BJP manifesto: రూ.5కే మీల్స్, అమ్మాయిలకు బైక్స్
వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్‌ను రోజుకు మూడుసార్లు ఏర్పాటు చేయనున్నట్లు నడ్డా చెప్పారు.
త్రిపురలో (Tripura) ఫిబ్రవరి 16వ తేదీన అసెంబ్లీ (Assembly) ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్, మేఘాలయలలో సాధారణ ఎన్నికలు, అలాగే ఐదు రాష్ట్రాల్లోని ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు ఫిబ్రవరి 27న ఉన్నాయి. ఈ అన్ని ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదీన వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా కృషి చేస్తోంది. వచ్చే వారం ఎన్నికలు జరిగే త్రిపుర మేనిఫెస్టోను గురువారం పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా (JP Nadda) ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో కలిసి విడుదల చేశారు. పేదలకు 5 రూపాయలకే మీల్స్, విద్యార్థినులకు బైక్స్ వంటి ఎన్నో హామీలను ఇచ్చింది. రూ.5 మీల్స్‌ను రోజుకు మూడుసార్లు ఏర్పాటు చేయనున్నట్లు నడ్డా చెప్పారు. బాలికా సమృద్ధి బాండ్ కింద ఆడపిల్ల పుడితే రూ.50,000 ఇస్తామని, మెరిట్ కలిగిన విద్యార్థినులకు ముఖ్యమంత్రి కన్య ఆత్మనిర్భర్ యోజన కింద బైక్స్ ఇస్తామని తెలిపారు. ఇంకా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రెండు ఉచిత సిలిండర్లు, ల్యాండ్ డీడ్స్, కౌలు రైతులకు ఏడాదికి రూ.3000 అందిస్తామని మేనిఫెస్టోను కూర్చారు. అరవై అసెంబ్లీ స్థానాలు కలిగిన త్రిపురలో ట్రైబల్స్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ 33 శాతం అంటే 20 సీట్లు వారికే కేటాయించింది కమలం పార్టీ. 2018లో ట్రైబల్ ప్రభావం కలిగిన 20 సీట్లకు గాను 10 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2013లో లెఫ్ట్ గవర్నమెంట్ ఏకంగా 19 సీట్లు గెలిచింది. కానీ 2018లో బీజేపీకి కోల్పోవాల్సి వచ్చింది.
తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే త్రిపుర ఉన్నత గ్రామ్ ఫండ్ కింద రూ.600 కోట్ల విడుదల చేస్తామని తెలిపింది. వీటిని మౌలిక సదుపాయాలు సహా వివిధ గ్రామీణ అభివృద్ధికి వినియోగిస్తామని పేర్కొన్నారు. మహారాజా వీర్ విక్రమ్ మాణిక్య ట్రైబ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ.6000 నుండి రూ.8000కు పెంచుతామని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఫ్యామిలీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు.
మేనిఫెస్టో విడుదల సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. మోడీ (Narendra Modi) ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి గురించి ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి యాక్ట్ ఈస్ట్ విధానంతో ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి స్వయంగా 50కి పైగా పర్యటనలు ఈశాన్య ప్రాంతంలో చేశారని గుర్తు చేశారు. త్రిపుర ఒకప్పుడు దిగ్బంధనాలకు, తిరిగుబాటుకు ప్రసిద్ధి చెందిందని, తాము అధికారంలోకి వచ్చాక శాంతి, శ్రేయస్సు, అభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. త్రిపురలో 13 లక్షల హెల్త్ కార్డులు ఇచ్చామని, రూ.107 కోట్లు సెటిల్మెంట్ రూపంలో ఇచ్చినట్లు తెలిపారు. ఆదివాసీల సంక్షేమంతో పాటు ఆదివాసీల గిరిజనులకు గుర్తింపు కీలక అంశాలుగా బీజేపీ భావిస్తోంది. ఇక్కడ కేంద్రమంత్రులు కూడా ప్రచారం నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వచ్చారు. అసోంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తొలుత త్రిపురలో గెలిచాక… ఆ తర్వాత మణిపూర్ వంటి ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోను అధికారం చేజిక్కించుకుంది.