Karnataka Election : కర్ణాటక ఎన్నికల పోరు… కమలం జోరు
కర్ణాటక (Karnataka) కమలంలో ఎన్నికల పోరు జోరుందుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections)ఏప్రిల్ చివారి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ జరిగే అవకాశలు అధికంగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది
కర్ణాటక (Karnataka) కమలంలో ఎన్నికల పోరు జోరుందుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ( Assembly elections)ఏప్రిల్ చివారి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ జరిగే అవకాశలు అధికంగా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలకు సంబంధించి కసరత్తు చేసే అ వకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మొత్తం 224 శాసనసభా నియోజకవర్గాలకుగాను ఏకాభిప్రాయం ఉన్న 100 నియోజకవర్గాల్లో తలా ఒక అభ్యర్ధి పేరును, ఒకింత కిష్టంగా ఉన్న మిగిలిన నియోజకవరాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్ధుల పేర్లను సూచించాలని అధిష్టానం పెద్దలు రాష్ట్ర బీజేపీ కోర్‌కమిటీ(State BJP Core Committee)కి సూచించారని తెలుస్తోంది.
అయితే ఏ, బీ, సీ, డీ అనే నాలుగు కేటగిరీలుగా విభజించి అభ్యర్ధుల పేర్లతో జాబితా రూపకల్పనకు రాష్ట్ర కోర్‌కమిటీ(State Core Committee)సన్నాహాలు చేస్తున్నట్లు కథనం. ఇందులో ఏ కేటగిరిలో పూర్తిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లే ఉంటాయి. పైగా ఇవన్నీ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అంచనా వేసే నియోజకవర్గాలై ఉంటాయి. ఇక బీ కేటగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో పేరును కూడా అదనంగా సూచిస్తారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలను కూడా ఇదే కేటగిరిలో చేర్చాలని తీర్మానించారు. ఇక సీ కేటగిరిలో 5 నుంచి 10వేల ఓట్ల తేడాతో ఒడిపోయిన నియోజకవర్గాలను చేర్చి కనీసం మూడు పేర్లను సిఫార్సు చేస్తారు. ఇక డీ కేటగిరిలో ఈసారి టికెట్లను నిరాకరించే సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ఇద్దరు లేదా ముగ్గురి పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం యడియూరప్ప(Former CM Yeddyurappa) తరహాలోనే 75 సంవత్సరాల వయస్సు దాటిన ఎమ్మెల్యేలకు, స్థానికంగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లను నిరాకరించి వారి సేవలను పార్టీకోసం వినియోగించుకునే అవకాశాలున్నాయి.
నికరంగా ఈ సంఖ్య ఎంత అనే అంశాన్ని మాత్రం బీజేపీ (BJP) శ్రేణులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డు( BJP Parliamentary Board)సభ్యుడి హోదాలో మాజీ సీఎం యడియూరప్ప కూడా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉండటంతో అభ్యర్ధుల ఎంపికలో ఆయన పాత్ర అత్యంత కీలకం కావచ్చునని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. యడియూరప్పకు నచ్చని వారికి టికెట్లు ఇస్తే వారిని గెలిపించే విషయంలో ఆయన ఆసక్తి చూపకపోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధిష్టానం పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే సంఘ్‌పరివార్ (Sangh Parivar) వత్తిడి మేరకు పార్టీ జాతీయ సంఘటనా కార్యదర్శి బీఎల్ సంతోష్ (BL Santosh)చేసే సిఫార్సులను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మూడంచెల వడపోత అనంతరమే అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ఈసారి అభ్యర్ధుల ఎంపిక ఆశ్చర్యకరంగా ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.