తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు.
విశాఖ రాజధాని, త్వరలో జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ మరోసారి తెలిపారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని.. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామని జగన్ అన్నారు.
Gummanuru Jayaram: వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ నుంచి విడిపోతున్నట్లు గుమ్మనూరు జయరాం పక్రటించారు. అలాగే మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్‌ఛార్జ్‌ల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ సీటు దక్కలేదు. ఎంపీగా పోటీ చేయమని హైకమాండ్ ఆదేశించింది. దీంతో జయరాం పార్టీ నుంచి వీడుతున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలో టీడీపీ ఆధ్యర్యంలో జయహో బీసీ సభ నిర్వహిస...
టీడీపీ, జనసేన స్వార్థం కోసం కలవలేదని.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకునేందుకే కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏది అభివృద్ధో? ఏది దోపిడినో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పెనుకొండ సభలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ రాష్ట్రాభివృద్ధికి ప్రమాదకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు.
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోతాయన్నారు.
వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని సునీత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరచి రాజకీయాలు చేస్తోందని మేడిగడ్డ పర్యటనలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణను మరోసారి ఎడారిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు.
అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లకు నిధులు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. లా కమిషన్ 2029 నుంచి జమిలి ఎన్నికలు జరిగేలా రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చాలని సిఫారసు చేసింది.