వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది కీలకనేతలు పార్టీ నుంచి విడిపోయారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి ఏ మాత్రమూ కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు కార్డు లేదా ఇతర ఏ నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని అయినా చూపించి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
టీడీపీ తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థుల పనితీరు అంచనాలను అందుకోకపోతే సీటు మరొకరికి కేటాయించేందుకు వెనకాడబోమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన 27 కిలోల నగలను త్వరలో వేలం వేయనున్నారు. ఆమె చెల్లించాల్సిన జరిమానాలు చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైసీపీకి ఎట్టకేలకు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు.
ఆంధ్రపదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ అధ్వర్యంలో ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు ఇచ్చింది. న్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశారు. త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందించే పథకాన్ని కూడా అమలు చేయనుంది.