»Atchannaidu Protests Against Sand Exploitation Across Ap
Atchannaidu: ఏపీ వ్యాప్తంగా ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా నిరసనలు
ఆంధ్రపదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ అధ్వర్యంలో ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Atchannaidu: ఆంధ్రపదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీ అధ్వర్యంలో ఈ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు లూటీ చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని.. వాటికి సంబంధించిన ఫొటోలు, నకిలీ బిల్లుల పుస్తకాలు, తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్లింది. అయిన జగన్ ఇసుక దోపిడి ఆపడం లేదని తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల కనుసన్నల్లో 500కి పైగా రిచ్ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారంది. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆందోళనల నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల శ్రేణుల ఇసుక రీచ్‌ల వద్ద నిరసనలు తెలియజేస్తాం. వైసీపీ అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫొటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని అచ్చెన్నాయుడు అన్నారు.