Trisha : టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన త్రిష
ఓ టీవీ ఛానెల్ యాంకర్ ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. యాంకర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న త్రిష కిడ్నాప్ చేయించిందని అంటున్నారు.
Trisha : ఓ టీవీ ఛానెల్ యాంకర్ ను త్రిష అనే యువతి కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. యాంకర్ని పెళ్లి చేసుకోవాలనుకున్న త్రిష కిడ్నాప్ చేయించిందని అంటున్నారు. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడిన త్రిష.. కిడ్నాప్ పాల్పడి పోలీసులకు చిక్కింది. ఓ టీవీ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తున్న ప్రణవ్ను పెళ్లి చేసుకోమని త్రిష చెప్పి గదిలో బంధించినట్లు తెలుస్తోంది. ప్రణవ్ చాలా నరకం అనుభవించాడు. త్రిష బంధించిన జైలు నుండి తప్పించుకుని యాంకర్ పోలీసులను ఆశ్రయించాడు. త్రిష అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తోందని తేలింది. భరత్ మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫోటోలను చూసి ప్రేమలో పడిన త్రిష.. పెళ్లి చేసుకుంటే అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. అసలు యాంకర్ ప్రణవ్ ఆ ప్రొఫైల్ పెట్టలేదు, ప్రణవ్ పేరుతో ఫేక్ ఐడీ సృష్టించిన సైబర్ దుండగులు అతని పేరు మీద డబ్బు సంపాదించే స్కెచ్ వేశారు. ఇక నిజంగానే ప్రణవ్ ఐడి అనుకోని ఇష్టపడ్డ త్రిష పెళ్లి అతన్నే చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ప్రణవ్ పై ఇష్టంతో మనసు పడ్డ త్రిష కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. ఇక ప్రణవ్ ఆమె అదుపు నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. . దీంతో రంగంలోకి దిగిన పోలీసులు త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మూడు వందల కోట్ల రూపాయలతో ఐదు స్టార్టప్ కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రణవ్ కిడ్నాప్ కేసులో పట్టుబడి జైలుకెళ్లింది త్రిష.