వచ్చే ఎన్నికల్లో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీకి తాజాగా ఎన్నికల సంఘం నుంచి గుర్తు కూడా లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన పార్టీకి ఎన్నికల గుర్తును కేటాయించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సాధారణ గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కేటాయించింది.
ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారంచేశారు. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌కర్ తన ఛాంబర్‌లో ఆమె చేత ప్రమాణం చేయించారు.
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 34 మందితో కూడిన లిస్ట్‌ను ఆ పార్టీ విడుదల చేసింది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా.. తాజాగా సెకెండ్ లిస్ట్‌ను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుంది? ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తుందన్న విషయాలు దాదాపుగా ఖరారు అయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఈ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా తమిళ హీరో దళపతి విజయ్ ఈ విషయంపై స్పందించారు.
హర్యానాలో రాజకీయలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ సభపై స్పందించారు. మేదరమెట్లలో వైకాపా సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ ఫోటోలను ట్వీట్ చేశారు.
రైతుబంధును గత ప్రభుత్వం ఎలాంటి భూమికైన ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కొన్ని మార్పులు చేస్తోంది. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
మధ్యప్రదేశ్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సురేశ్ పచౌరీ బీజేపీలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు.
ఇప్పటికే పలువురు క్రికెటర్లు రాజకీయాల్లో ఉన్నారు. మరో స్టార్ క్రికెటర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. టీమ్‌ఇండియా పేసర్ మహమ్మద్ షమి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.