»Vijay Implementation Of Citizenship Amendment Act Is Not Acceptable At All
Vijay: పౌరసత్వ సవరణ చట్టం అమలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు
పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఈ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా తమిళ హీరో దళపతి విజయ్ ఈ విషయంపై స్పందించారు.
Vijay: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్‌పై పార్టీ నేతలు స్పందిస్తున్నారు. కొందరు ఈ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సీఏఏ అమలుపై తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. తమిళనాడులో సీఏఏను అమలు చేయవద్దంటూ రాష్ట్ర సర్కారుకు ఆయన విజ్ఞప్తి చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం అమలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో దీన్ని అమలు చేయకూడదని కోరుతున్నా. ఈ అంశంపై ప్రభుత్వ నేతలు ప్రజలకు హామీ ఇవ్వాలని ప్రకటనలో కోరారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసి ఇటీవల రాజకీయాల్లో అడుగుపెట్టారు. అయితే ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇతరు పార్టీలకు మద్దతు ఇవ్వమన్నారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని వెల్లడించారు.