»Kodi Kathi Srinu Political Entry To Contest From Amalapuram
kodi katti srinu : అమలాపురం నుంచి కోడి కత్తి శ్రీను ఎమ్మెల్యేగా పోటీ!
జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను అమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇంతకీ అతడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడంటే...
kodi katti seenu : కోడి కత్తితో దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు. అమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నాడు. అతడు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో సోమవారం చేరాడు. జడ శ్రావణ్ అతడికి కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కోడి కత్తి శ్రీను(Kodi Kathi Srinu) వెల్లడించాడు.
2018లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖపట్టణం విమానాశ్రయం దగ్గర కోడి కత్తితో జగన్‌పై శ్రీను దాడి చేశాడు. దీంతో అతడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న అతనికి కోర్టు ఫిబ్రవరి 9వ తేదీన బెయిలు ఇచ్చింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యాడు. ఈనెల 11వ తేదీన జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరాడు. ఇప్పుడు అమలాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు.
వివేకారెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా గతంలో ఇదే పార్టీలో చేరాడు. ఆయన పులివెందుల నుంచి సీఎం జగన్‌పై పోటీ చేస్తానని ప్రకటించాడు. దీంతో వీరిద్దరి పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.