»570 Gallbladder Stones Removed From A Women Stomach In Amalapuram
Stones : పొట్ట నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళ, స్కానింగ్‌లో చూస్తే 500కు పైగా రాళ్లు!
ఎన్నో రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న మహిళ చివరికి ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు స్కానింగ్ చేసి చూడగా గాల్ బ్లాడర్‌లో పెద్ద ఎత్తున రాళ్లు ఉండటాన్ని గుర్తించారు. తర్వాత ఏమైందంటే..?
Gallbladder Stones : ఓ మహిళ పొట్టలో పదుల సంఖ్యలో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో రాళ్లను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. చివరికి ఆమెకు శస్త్ర చికిత్స చేసి నొప్పి నుంచి విముక్తి కలిగించారు. ఈ ఘటనన ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లవరం మండలం దేవగుప్తం అనే ఊరికి చెందిన నరసవేణి(31) ఎప్పటి నుంచో కడుపు నొప్పితో బాధ పడుతూ ఉన్నారు. నొప్పి వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్లు వేసుకుని నెట్టుకువస్తున్నారు.
కొన్ని రోజులుగా నొప్పి బాగా తీవ్రం కావడంతో ఆమె అమలాపురంలోని(Amalapuram) ఏఎస్ఏ ఆసుపత్రిలో చేరారు. ఆమె పొట్టకు వైద్యులు స్కానింగ్ చేసి చూడగా లోపల పెద్ద ఎత్తున రాళ్లు కనిపించాయి. గాల్ బ్లాడర్‌లో(Gallbladder) ఎక్కువ స్టోన్స్(Stones) ఉండటంతో ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. తర్వాత చూడగా మొత్తం 570 రాళ్లు బయటకు వచ్చాయి. ఇది చాలా రేర్ కేస్ అని వైద్యులు తెలిపారు. గాల్ బ్లాడర్‌లో ఇంత పెద్ద మొత్తంలో రాళ్లు ఉండటంపై వైద్యులే ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని ఇక ఆ మహిళకు నొప్పి నుంచి విముక్తి లభిస్తుందని వైద్యులు తెలిపారు.