కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలపై కక్ష కట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న పట్టించుకోరా? అని ప్రశ్నించారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అలాగే సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
KTR: ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారని నోటీసులు పంపారు. వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్...
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు తెలిపారు.
పత్రిపక్ష నేతల ఫోన్ల ట్యాప్ చేశారని గతంలో బిజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దుబ్బాక, మునగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని లక్ష్మణ్ అన్నారు. దీనిపై పూర్తిగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిన కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించిన తర్వాత ఇడుపులపాయలో షర్మిల మాట్లాడారు. ఈక్రమంలో సీఎం జగన్‌పై ఆమె ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. లోకేష్‌కు మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు, నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని తెలిపారు.