టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఆపార్టీ విరాళా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. పార్టీ కేంద్ర కార్యాలయం అయిన మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో https://tdpforandhra.com వైబ్‌సైట్‌ను ప్రారంభించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కామెంట్స్ చేసిన మంత్రులకు మాజీ మంత్రి హరీశరావు కౌంటర్ ఇచ్చారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు కేసీఆర్‌పై మాట్లాడటం సరికాదన్నారు.
పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ల పంపిణీకి మూడు రోజుల సమయం పట్టేదన్నారు. పింఛన్ కోసం వెళ్లి ఎంతోమంది చనిపోయారని విమర్శించారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.
హిందూపురం వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీతో పాటు ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు, మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖ పంపించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ కేసులో ఆమెను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని.. ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్లారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ శవరాజకీయం చేస్తోందని వాళ్ల డీఎన్‌లోనే శవరాజకీయం ఉందని చంద్రబాబు అన్నారు.