లోక్‌సభ ఎన్నికల సమయంలో హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో జనతా దళ్ సెక్యులర్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో జనసేన హైకోర్టులో పిటిషన్ వేసింది.
టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై పోసాని మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్ధతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపరంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి, సీపీఎస్ రద్దు లేదని ఆరోపించారు.
ఆంధ్రపదేశ్‌లో వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మరి ఆ హామీలేంటో తెలుసుకుందాం.
బీఆర్‌ఎస్ పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం అని 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి కేసీఆర్ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కూడా కల్పించలేదన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలోని కూటమి లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని.. ఓ తరం కోసమన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల మార్పులపై కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్‌ని దాఖలు చేయడానికి ఆయన సతీమని నారా భువనేశ్వరి ర్యాలీ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.