ఆంధ్రపదేశ్‌లో వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మరి ఆ హామీలేంటో తెలుసుకుందాం.
Andhra Pradesh: ఆంధ్రపదేశ్‌లో వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. చంద్రబాబులా అబద్దపు హామీలతో మోసాలు చేయకుండా సాధ్యమయ్యే వాటినే అమలు చేస్తామని తెలుపుతూ విడుదల చేశారు. పాత పథకాలనే కొనసాగిస్తున్నారు. అమ్మఒడి కింద ఇంతకు ముందు రూ.15 వేలు ఇచ్చేవారు. దానిని రెండు వేలు పెంచి రూ.17 వేలకు ఇస్తామని తెలిపారు. అలాగు వైఎస్సార్ సున్నావడ్డీ కింద మహిళలకు రూ.3 లక్షల వరకు రుణాలు, అర్హులైన వాళ్లందరికీ ఇళ్లు అందిస్తామని తెలిపారు. అలాగే ప్రతి నెల అందిస్తూ రూ.3 వేల పెన్షన్‌ను పెంచుతూ రెండు విడతలుగా అందిస్తామని తెలిపారు.
రైతు భరోసాను రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. స్విగ్గి, జొమాటో, గిగ్ వర్కర్లకు కూడా వైఎస్ఆర్ భీమా వర్తించేలా చేస్తామని తెలిపారు. అలాగే జిల్లాకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా విశాఖను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అధికారంలోకి రాగానే.. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఉంటాయని తెలిపారు.
45 ఏళ్లు పైబడ్డ మహిళలకు వైఎస్ఆర్ చేయూతను రూ.75 వేల నుంచి లక్షా యాభై వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షలకు పెంచారు. ఓబీసీ నేస్తం రూ.1.20 లక్షలకు పెంచారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాల క్రింద పొదుపు సంస్థలకు ఐదేళ్లకు రూ. 3లక్షల రూపాయలు, కళ్యాణ మస్తు.. షాదే తోఫా కొనసాగింపు, పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని తెలిపారు. స్వయం ఉపాధి పథకాన్ని కొనసాగిస్తూ వాహన మిత్రను సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వాళ్లకి కూడా ఇస్తాం. ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల భీమా అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు.