»Janasena Janasena Filed A Petition In The High Court
Janasena: హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన జనసేన
ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. దీంతో జనసేన హైకోర్టులో పిటిషన్ వేసింది.
Janasena: Janasena filed a petition in the High Court
Janasena: ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. ప్రస్తుతం జనసేన టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో అదే గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చి, స్వతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తును కేటాయించింది. దీనిపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ జనసేన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.