KRNL: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 17న (సోమవారం) నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని సునయన ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిలోనూ ఈ వేదిక జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.