KRNL: నేరచరిత్ర కలిగిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన వారికి సూచించారు. నేరాల్లో మళ్లీ పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.