VKB: కొడంగల్ మండలం రుద్రారం గ్రామంలో విద్యుత్ దీపాల మరమ్మతులు జరుగుతున్నాయి. ఈనెల 17,18,19వ తేదీలలో మూడు రోజులపాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని AE ప్రవీణ్ కుమార్ తెలిపారు. రుద్రారం, నాగారం, పాటీమీదిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు విద్యుత్ అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.