»Komatireddy Venkatareddy In The Past I Gave Up My Post
Komatireddy Venkatareddy: గతంలో నేను పదవి వదులుకున్నా!
మాజీ మంత్రి కేసీఆర్ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కూడా కల్పించలేదన్నారు.
Komatireddy Venkatareddy: In the past I gave up my post!
Komatireddy Venkatareddy: మాజీ మంత్రి కేసీఆర్ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కూడా కల్పించలేదన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్‌రావు భయపడుతున్నారన్నారు. గతంలో మంత్రి పదవి వదులుకున్నట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయటకు రాలేదు. రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 60 సార్లు సచివాలయానికి వచ్చారు. అందులో పదిశాతం కూడా ఆయన సచివాలయానికి రాలేదు.
బీఆర్ఎస్ పార్టీ మూతపడే స్థితికి వచ్చిందని వెంకట్‌రెడ్డి అన్నారు. అసలు హరీశ్‌రావుకి రైతులపై ప్రేమ లేదు. నాటకాలు మాత్రమే ఆడుతున్నాడు. సాధారణంగా రాజీనామా పత్రం ఒకటిన్నర లైను మాత్రమే ఉండాలి. కానీ ఒకటిన్నర పేజీ రాశారు. అసలు అది ఆమోదం పొందదని వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సీఎం దళితుడని కేసీఆర్ అన్నారు. కానీ పరిపాలన అనుభవం ఉండాలని తెలిపి తొలిసారి ఆయనే సీఎం అయ్యారు. రైతులపై అంత ప్రేమ ఉంటే హరీశ్‌రావు తన రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.