Bonda Uma: Police should wear YCP uniform and do duty
Bonda Uma: పోలీసులు వైసీపీను కాస్తున్నారని.. ఇకనైనా ఆ పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు. తనను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన సీపీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసి అయిన ఇతర అధికారుల్లో మార్పులు రావాలని తెలిపారు. పోలీసులు వైసీపీ పరిధిలో కాకుండా ఈసీ పరిధిలో ఉన్నామని గుర్తించాలని తెలిపారు.
విజయవాడ సెంట్రల్లో ఏసీపీ, సీఐలు వెలంపల్లి జాడల్లో నడుస్తున్నారని ఉమా విమర్శించారు. వీళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసీకి ఫర్యాదు చేస్తామని ఉమా తెలిపారు. సెర్ప్ సీఈవో మురళీధర్రెడ్డని వెంటనే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి దగ్గరే ఫించన్లు పంపిణీ చేసే విధంగా చేయాలని బొండా ఉమా డిమాండ్ చేశారు. పోలీసులు ఎన్నికల విధానం ప్రకారం వాళ్ల పని చేయాలన్నారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరని హచ్చరించారని తెలిపారు.