YS Sharmila: Jagan mentioned about the dress I wore without seeing it as my own sister
YS Sharmila: సీఎం జగన్ తన సొంత చెల్లి ధరించే దుస్తుల గురించి వేలమంది ఉండే సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ ఆయనపై మండిపడ్డారు. వేల మంది మగవాళ్లు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లిని అని చూడకుండా ఆమె ధరించిన దుస్తుల గురించి మాట్లాడటం కరెక్టేనా అని షర్మిల అన్నారు. పచ్చచీర కట్టుకుని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి. నేను చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నా అని అన్నారు. పచ్చచీర కట్టుకుంటే ఏమవుతుంది.
సాక్షి ప్రతిక, సాక్షి ఛానల్లో పైన పసుపు రంగు ఉంటుంది. ఆ పసుపు రంగు టీడీపీ సొంతం కాదని షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా దుస్తుల గురించి మాట్లాడటం సభ్యత కాదన్నారు. అసలు సీఎం జగన్‌కు సంస్కారం ఉందా? అని షర్మిల మండిపడ్డారు. అయిన నేను వైఎస్సార్ బిడ్డను. వేరే వాళ్లు రాసిచ్చిన స్క్రిప్టు చదివేది నేను కాదన్నారు. సామాజిక కార్యక్రమాల్లో వైసీపీ కార్యకర్తలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. అసలు జగన్ వైఎస్సార్‌కు వారసుడు కాదు.. మోదీకి వారసుడని షర్మిల అన్నారు.