AP Assembly Elections: పోలింగ్ రోజు కూడా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతున్న వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దాడులు చేస్తున్నారు. ఓటేసేందుకు క్యూలైన్‌లో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా నేరుగా శివకుమార్ వెళ్తుండటంతో ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో శి...
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటుని పనిలా భావించకుండా.. బాధ్యతలా భావించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన వాళ్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలనపై మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించబోతుందని, ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ అన్నారు.
సైకో జగన్ ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దారుణమని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు.
బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈక్రమంలో రాహుల్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళ ఖాతాల్లోకి కొంత డబ్బును జమ చేస్తామని తెలిపారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎంపీగా అవినాష్‌రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయలేదని, హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే న్యాయస్థానం ఆమెకు ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు తెలిపింది.