లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
KTR: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో మే 13న తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. పోలింగ్ రోజు తెలంగాణ ప్రజలందరూ ఇన్వర్టర్, ఛార్జింగ్, బల్బులు, టార్చ్లైట్లు, కొవ్వొత్తులు, జనరేటర్లు, పవర్ బ్యాంకులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని కేటీఆర్ అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని గుర్తించుకోవాలన్నారు. తెలివిగా మే 13న ఓటు వేయాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Request all fellow citizens to stock up on the following products
అదానీ, అంబానీలు కాంగ్రెస్ పార్టీకి టెంపోల నిండా డబ్బు పంపుతుంటే ప్రధాని మోదీకి అత్యంత ఇష్టమైన ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు కరెంట్ సమస్యలు తలెత్తున్నాయని కేటీఆర్ పలుమార్లు చెప్పారు. అయితే వర్షాల కారణంగా కరెంట్‌కి అంతరాయాలు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.