మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలనపై మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించబోతుందని, ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ అన్నారు.
KCR: మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పాలనపై మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించబోతుందని, ఆ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఏ ఏ రంగాల్లో చేయబోతున్నారో చెప్పలేదన్నారు. వాళ్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రతిపక్షంపై విమర్శలు చేశారన్నారు. అసలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడటలేదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు చక్కగా ఉన్న అనేక వ్యవస్థలను పట్టించుకోవడం లేదన్నారు. రాజశేఖర్రెడ్డి సమయంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పరిధిలోకి అదనం కొన్ని జబ్బులు చేర్చి, అలాగే కొనసాగించాం. దానికి కావాల్సిన నిధులు కూడా విడుదల చేశామన్నారు.
రాజశేఖర్రెడ్డి తెలంగాణకి వ్యతిరేకి అయినా.. అతను ప్రారంభించిన పథకాలు మంచివి కావడంతో మేం వాటిని కొనసాగించామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు కరెంట్ కష్టాలు ఉండేవి. కానీ మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంట్ సరఫరా చేశామన్నారు. ఇటీవల హైదరాబాద్లో వర్షం పడితే చాలా చోట్ల పది గంటలపైనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల పంటలు ఎండిపోయాయని, మోటార్లు కాలిపోయాయని కేసీఆర్ అన్నారు. బాగా నడిచిన వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిస్తోందన్నారు. చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేదు. ఆగస్టు 15వ తేదీ అంటున్నారు. అది ఏ ఆగస్టు 15వ తేదీనో చెప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం శాసమని రైతులు భావిస్తున్నారని కేసీఆర్ అన్నారు.